- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
by Bhanu |
భార్యాభర్తలు ఇద్దరూ చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లి చేపలు పడుతుండగా భర్త నీట మునిగి మరణించిన హృదయ విధారకర సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ: శంకరపట్నం :భార్యాభర్తలు ఇద్దరూ చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లి చేపలు పడుతుండగా భర్త నీట మునిగి మరణించిన హృదయ విధారకర సంఘటన చోటుచేసుకుంది.గ్రామస్తుల కథనం ప్రకారం... శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన కొల్లూరి చంద్రమౌళి భార్య సరవ్వ తో కలిసి శుక్రవారం సాయంత్రం వారి పొలం పక్కనే ఉన్న చింతకుంట చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లి చెరో వైపు చీరను పట్టుకొని చేపలు పడుతుండగా భర్త చెరువు ఊబిలో దిగబడిపోయి ఊపిరాడక మరణించినట్లు తెలిపారు.మృతునికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.కళ్ళ ముందే భర్త చనిపోవడంతో ఇల్లాలు రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






