ఆల‌యంలో అవ‌మానం.. నిర‌స‌న‌కు దిగిన ర‌జ‌కులు

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని కొత్త‌గ‌ట్టు గ్రామంలో ఉన్న‌టువంటి శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయంలో పని చేస్తున్న రజకులు ఆలయం పైన ఉన్న‌ కళ్యాణ మండపంలోని పనిని కూడా తమకే అప్పగించాలని కోరారు.

ఆల‌యంలో అవ‌మానం.. నిర‌స‌న‌కు దిగిన ర‌జ‌కులు
X

దిశ, శంకరపట్నం : మండ‌ల ప‌రిధిలోని కొత్త‌గ‌ట్టు గ్రామంలో ఉన్న‌టువంటి శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయంలో పని చేస్తున్న రజకులు ఆలయం పైన ఉన్న‌ కళ్యాణ మండపంలోని పనిని కూడా తమకే అప్పగించాలని కోరారు. దీంతో ఆలయ ఈవో, చైర్మన్ అవమానపరిచారని ఆరోపిస్తూ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి ఆలయ గుట్టపైన వెట్టి చాకిరి చేస్తున్న తమను కాదని వారికి ఇష్టమున్న వ్యక్తులకు పనులను అప్పగిస్తున్నారని తెలిపారు. ఇలా అయితే తాము ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను చెప్పుకోవడానికి వెళితే మమ్మల్ని గుట్ట ఎక్క వద్దని గుట్ట పై నుంచి దిగి వెళ్లిపోవాలని తమను తమ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని ఆవేదన వెలుబుచ్చారు.

ఆలయ ప్రాంగణంలో అన్ని పనులను చేసే తమను కాదని కళ్యాణ మండపం టెండర్ పట్టుకున్న వ్యక్తికి వంత పాడుతూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అటు చైర్మన్ ఇటు ఆలయ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో చివరికి నిరసనకు దిగినట్టు తెలిపారు. కళ్యాణ మండపంలో కూడా పనులు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని వెంటనే ఈవోను సస్పెండ్ చేయాలని.. లేదంటే రజక సంఘం ఆధ్వర్యంలో నిరసనను ఉధృతం చేస్తామని తెలిపారు. నిరసన కార్యక్రమంలో కొత్త గట్టు రజక సంఘం అధ్యక్షుడు పైడిపల్లి ప్రవీణ్ ,మునిగంటి రాజు, మునిగంటి వెంకటయ్య, సారయ్య, కార్తీక్, స్వామి పాల్గొన్నారు.

Next Story