కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి

by Ratna Kumari |

రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి
X

దిశ, చొప్పదండి : రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ అన్నారు. బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామని, ఆన్లైన్ ప్రక్రియలో మార్పుల మూలాన రైతుల ఖాతాల్లో విక్రయించిన సొమ్ము తొందరగా జమ అవుతుందని వెల్లడించారు. మార్కెట్ వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్,పాక్స్ పర్సన్ ఇంచార్జ్ జమునారాణి, సీఈఓ తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానసగంగయ్య ,కౌన్సిలర్లు కొట్టే సునీతఅశోక్ , గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి,పిట్టల వెంకటేష్, సురేష్, ముద్దం తిరుపతి, జిట్ట కుమార్, చిల్ల శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story