- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మల్టీపర్పస్ సొసైటీగా ధర్మారం మత్స్యపారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం ఎంపిక
ధర్మారం మండల కేంద్రంలోని ధర్మారం గ్రామ మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం తెలంగాణ కోపరేటివ్ సొసైటీలో మల్టీ పర్పస్ సొసైటీగా ఎంపిక అయింది.

దిశ, ధర్మారం : ధర్మారం మండల కేంద్రంలోని ధర్మారం గ్రామ మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం తెలంగాణ కోపరేటివ్ సొసైటీలో మల్టీ పర్పస్ సొసైటీగా ఎంపిక అయ్యింది. తెలంగాణ కోపరేటివ్ సొసైటీలలో మల్టీపర్పస్ సొసైటీలుగా 67 సొసైటీలు సెలెక్ట్ చేయగా.. అందులో మొదటి విడుతగా తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు సొసైటీలను ఎంపిక చేశారు. వాటిలో పెద్దపల్లి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈ మూడు సొసైటీలను ఎంపిక చేసి ఒక సొసైటీకి 3 లక్షల రూపాయలు ఎన్ఎఫ్డీపీ ద్వారా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా నుంచి ధర్మారం గ్రామ మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం ఎంపిక చేసి భారత కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ ధర్మారం గ్రామ మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం అధ్యక్షుడు రేగుల శ్రీనివాస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల సెక్రటరీ మేడవేని శ్రీకాంత్, డైరెక్టర్ మేడవేని శ్రీధర్ బాబు, సభ్యులు మేడవేని నితిశ్ పాల్గొన్నారు.






