ఏజెంట్ చేతిలో మోసపోయిన నా భర్తను కాపాడండి

by Nallavelli.Anjaneyulu |

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ పట్టణ పరిధిలోని గోపాలపూర్ కు చెందిన ఆరెల్లి రవీందర్ జీవనోపాధికోరకై నాలుగు నెలల క్రితం ఒమన్ దేశం వెళ్లాడు.

ఏజెంట్ చేతిలో మోసపోయిన నా భర్తను కాపాడండి
X

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ పట్టణ పరిధిలోని గోపాలపూర్ కు చెందిన ఆరెల్లి రవీందర్ జీవనోపాధికోరకై నాలుగు నెలల క్రితం ఒమన్ దేశం వెళ్లాడు. ఏజెంట్ తప్పుడు సమాచారంతో ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కానీ కంపెనీ మాత్రం పని చేయించుకొని జీతం ఇవ్వకుండా మోసం చేశారు అని కేంద్ర సహాయ మంత్రి ని ఇటీవల వేడుకుంది బాధితుని భార్య. అంతే కాకుండా నా భర్త వేరే కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడని అందుకు వ్యతిరేకంగా ఆ కంపెనీ ఒమన్ దేశం క‌రెన్సీ ఐదు వందల రియాల్స్ జరిమానా విధించారు అని ఆమె మంత్రికి తెలిపారు.వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సంజయ్ ఇండియన్ ఎంబసీ కి ఆదేశాలు జారీ చేయడంతో బాధితుడు ఆరెల్లి రవీందర్ బుధవారం స్వదేశానికి చేరనున్నట్లు సమాచారం.ఈ సందర్భంగా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కు రవీందర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story