- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలు నుంచి జనంలోకి..ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి
దిశ, వేములవాడ టౌన్ : ఓ కేసు విషయంలో జగిత్యాల జైలులో నుండే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు

దిశ, వేములవాడ టౌన్ : ఓ కేసు విషయంలో జగిత్యాల జైలులో నుండే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే గ్రామానికి చేరుకున్న ఆయన ప్రచార పర్వం మొదలుపెట్టాడు. ఎన్నికల అధికారులు తనకు కేటాయించిన టి.వి రిమోట్ గుర్తును చేతబట్టి అనుచరులతో కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ రిమోట్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నాడు. గతంలో ఎంపీపీగా కొనసాగిన తరుణంలో గ్రామంతో పాటు మండల వ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని, అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. జైలు నుండి వచ్చినప్పటికీ గ్రామంలో మిగతా అభ్యర్థుల కంటే బాబు ప్రచారంలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గెలుపే లక్ష్యంగా బాబు ప్రచారం కొనసాగిస్తుండటంతో ప్రత్యర్థులు సైతం అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు ముగిసే వరకు అసలు జైలు నుండే రాడు అనుకున్న వ్యక్తి ముందే వచ్చి ప్రచారంలో దూసుకు వెళ్లడంతో గ్రామస్తులు సైతం ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అన్ని కలిసి వచ్చి బాబు ఘన విజయం సాధిస్తే మాత్రం ఇది పెద్ద చరిత్రే అవుతుందని స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.






