సర్పంచ్ ఆత్మహత్యాయత్నం....

by S Gopi |

పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అడిగినందుకు లంచం ఇవ్వాలని అధికారులు వేధిస్తున్నారంటూ... Sarpanch attempted suicide

సర్పంచ్ ఆత్మహత్యాయత్నం....
X

దిశ, సుల్తానాబాద్: పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అడిగినందుకు లంచం ఇవ్వాలని అధికారులు వేధిస్తున్నారంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన సర్పంచ్ అన్నారు. రవీందర్ రెడ్డి తనకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని అధికారులను అడిగితే అధికారులు లంచం ఇవ్వాలని అంటున్నారని ఆరోపిస్తూ ఎంపీడీవో కార్యాలయలయంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన గ్రామంలో పనిచేసిన రూ. 25 లక్షలకు సంబంధించిన బిల్లులు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ గ్రామ సర్పంచి సూసైడ్ అటెండ్ కు పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story