ద్విచక్ర వాహనాన్ని ఢీ ఇసుక ట్రాక్టర్.. బైకర్ తలభాగం నుజ్జు నిజ్జు

by Bhanu |   (  Updated:2025-06-05 16:08:48  IST  )

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్ర వాహనాన్ని ఢీ ఇసుక ట్రాక్టర్.. బైకర్ తలభాగం నుజ్జు నిజ్జు
X

దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారు నుండి మెట్ పల్లి పట్టణ వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్ స్థానిక ఓ రెస్టారెంట్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఘటనా స్థలంలో వ్యక్తి తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మెట్ పల్లి పోలీసులు ఘటన వద్దకు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.


అయితే ఇసుక ట్రాక్టర్ అక్రమమా..? సక్రమమా..? అనే విషయాలతో పాటు ప్రమాదంలో మరణించిన వ్యక్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాదంలో వ్యక్తి తల నుజ్జు నుజ్జు అవడం తో చూపర్లను భయాందోళనకు గురిచేసే ఘటన ఏర్పడిందని స్థానికులు తెలిపారు.

Next Story