ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందా

by Ajay Maddhiboyina |

నిరుపేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పుడూ...? ఎలా పూర్తి అవుతుందో...? ఎంత ఖర్చు అవుతుందోనని ఓ వైపు లబ్ధిదారులు ఆందోళన చెందుతుంటే

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందా
X

దిశ, కరీంనగర్ బ్యూరో: నిరుపేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పుడూ...? ఎలా పూర్తి అవుతుందో...? ఎంత ఖర్చు అవుతుందోనని ఓ వైపు లబ్ధిదారులు ఆందోళన చెందుతుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ని ఇసుక వ్యాపారులకు మాత్రం ఈ పథకం కాసుల వర్షం కురిపిస్తున్నటు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని సూచిస్తూ తరలింపునకు అనుమతులు ఇస్తుంటే, ఇక ఇదే అదునుగా భావిస్తున్న ఇసుక వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆశయానికే కాదు లబ్ధిదారుల ఆశలకు ఇసుక వ్యాపారులు గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకే వే బిల్లుపై రవాణా..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉండొ ద్దనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల రెవె న్యూ అధికారులు ఇసుక తరలింపునకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ క్రమం లో ఒక్కొక్క వే బిల్లుకు ఒక ట్రిప్పు ఇసుకను మాత్ర మే తరలించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తు న్నారు. అయితే ఇసుక వ్యాపారాలు మాత్రం రెవె న్యూ అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కు తూ రెండు ట్రిప్పులు ఇందిరమ్మ ఇళ్లకు, మరో నాలు గు ట్రిప్పులు బయటకు తరలిస్తూ, ఒక్కో వే బిల్లుపై పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

గోదావరిలో నీటి ప్రవాహంతో..

మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు పరిధిలో ఉన్న మానేరు, మూలవాగులే ఇసుకకు ప్రధాన వనరుగా మారాయి. దీంతో ఈ రెండు కేంద్రాలుగా ప్రతినిత్యం వేలాది సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో వర్షాలు కురిసి ఈరెండు వాగు ల్లోనూ నీరు చేరే పరిస్థితి కనిపిస్తుండడంతో ఇసుక వ్యాపారులు ముందస్తు జాగ్రత్తలు భాగంగా ఇంది రమ్మ ఇండ్ల పేరుతో అనుమతులు పొంది పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పక్కదారి పట్టిస్తూ రహస్య ప్రాం తాల్లో డంపు చేస్తున్నారు. వేములవాడ పట్టణంలో ఇప్పటికే ఇలాంటి డంపులను రెవెన్యూ అధికారులు గుర్తించి సీజ్ చేశారు.

అంతా అధికార పార్టీ నాయకులేనా..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అధికార పార్టీ నాయకులే పెంచి పోషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే జిల్లావ్యాప్తంగా నడిచే అత్యధిక ట్రాక్టర్లలో అధికార పార్టీ నాయకులకు భాగస్వామ్యం ఉన్నట్టు, మిగిలిన వాటి నుంచి వాటా లు ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమవంతుగా రెవెన్యూ సిబ్బంది..

పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ రవా ణాలో కేవలం అధికార పార్టీ నాయకులే కా కుండా రెవెన్యూ సిబ్బంది సైతం తమవంతు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఇసుక వ్యాపారుల నుంచి రూ.వేలల్లో ముడుపులు అందుతున్నాయని, రాత్రి వేళల్లో ఇసుక వ్యాపారులు పంపించిన డబ్బుతో సిబ్బంది దావత్ లు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సతమతమవుతున్న అధికారులు

ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో అక్రమ ఇసుక రవాణాలను అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు నానా తంటాలు పడుతున్నట్లు వాద నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమఇసుక రవా ణాను అడ్డుకునే క్రమంలో రెవెన్యూ, ఇతర సం బంధిత శాఖల అధికారులు ట్రాక్టర్లను అడ్డు కున్న, దాచిన డంపులను సీజ్ చేసిన అధికార పార్టీ నాయకులు వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటం, వినని పక్షంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో అధికారులకు ఫోన్లు చేయిస్తున్నారని తెలుస్తోంది. దీనికితోడు రెవె న్యూ సిబ్బంది సైతం ఇసుక వ్యాపారులతో చేతు లు కలిపి అక్రమాలకు తెరలేపడంతో ఏం చేయా లో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టు కుని తీవ్రంగా సతమవుతమవుతున్నట్లు రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Next Story