బీర్ పూర్ ఎస్సైగా సబ్బాని రాజు

by Bhanu |

బీర్‌పూర్ మండలంలో కొత్త ఎస్సైగా సబ్బాని రాజు ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

బీర్ పూర్ ఎస్సైగా సబ్బాని రాజు
X

దిశ, బీర్‌పూర్: బీర్‌పూర్ మండలంలో కొత్త ఎస్సైగా సబ్బాని రాజు ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బీర్‌పూర్‌లో ఎస్సైగా పనిచేసిన కుమారస్వామి జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సబ్బాని రాజు బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నూతన ఎస్సై రాజు, మండల ప్రజల సహకారంతో శాంతి భద్రతలు కాపాడేందుకు కట్టుబడి ఉంటానన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాగే సైబర్ నేరాల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story