రైతుబంధు తొలి ల‌బ్ధిదారుడు, మాజీ స‌ర్పంచ్ సంజీవ‌రెడ్డి క‌న్నుమూత

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుగా నిలిచిన 'రైతుబంధు' పథకాన్ని రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా అందుకున్న రైతు, హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి నివాసి మూగల సంజీవరెడ్డి (82) బుధవారం తుదిశ్వాస విడిచారు.

రైతుబంధు తొలి ల‌బ్ధిదారుడు, మాజీ స‌ర్పంచ్ సంజీవ‌రెడ్డి క‌న్నుమూత
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుగా నిలిచిన 'రైతుబంధు' పథకాన్ని రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా అందుకున్న రైతు, హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి నివాసి మూగల సంజీవరెడ్డి (82) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గొంతు మూగబోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

చరిత్రలో నిలిచిన క్షణం..

​తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని ప్రారంభించినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో రాష్ట్రంలోనే తొలి రైతుబంధు చెక్కును అందుకున్న ఘనత సంజీవరెడ్డికి దక్కింది. ఆ ఫోటో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

​ప్రజా సేవలో ముందున్న నాయకుడిగా

​సంజీవరెడ్డి కి మంచి పేరుంది. కేవలం రైతుగానే కాకుండా, ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేశారు. 1981లో ధర్మరాజుపల్లి గ్రామ మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి పునాదులు వేశారు. విత్తన సంఘం వ్యవస్థాపకులుగా, రైతు సేవ పొదుపు సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ స్థానిక రైతులకు అండగా నిలిచారు. నిబద్ధత గల నాయకుడిగా, వివాదరహితుడిగా గ్రామంలో,మండల స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. సంజీవరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ధర్మరాజుపల్లి గ్రామానికి, రైతు లోకానికి తీరని లోటని పేర్కొన్నారు.

Next Story