- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుద్రంగిలో అనుమానాస్పద మృతి కలకలం.. న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబ సభ్యులు
ఐదు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సిర్రం వెంకటి ఘటనను కుటుంబ సభ్యులు హత్యగా అభివర్ణిస్తూ ఆందోళనకు దిగారు.

దిశ, రుద్రంగి : ఐదు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సిర్రం వెంకటి ఘటనను కుటుంబ సభ్యులు హత్యగా అభివర్ణిస్తూ ఆందోళనకు దిగారు. రుద్రంగి మండలానికి చెందిన వెంకటి నందివాగు సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందగా, పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మృతుని భార్య కొమురవ్వ, కుమారుడు మహేందర్, కూతురు మంజులతో పాటు బంధువులు ఆదివారం ఇందిరాచౌక్ వద్ద రాస్తారోకో చేశారు. మాకు న్యాయం జరగేవరకు పోరాటం ఆపమంటూ నినాదాలు చేశారు. గత గొడవల నేపథ్యంలో పథకం ప్రకారంగా జరిగిన హత్యేనని వారు ఆరోపించారు.
ధర్నా జరిగిన స్థలానికి ఎస్‌ఐ శ్రీనివాస్ చేరుకుని బాధితులతో మాట్లాడారు. వారి ఆవేదనను అర్థం చేసుకుంటూ, న్యాయం జరగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ.. మృతుడు అనుమానాస్పద మృతిచెందిన కేసుగా నమోదు చేసుకున్నామని, ఇది హత్యా లేక ప్రమాదమా అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేశారు.






