- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > రుద్రంగి ఎస్‌ఐగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ..శాంతి భద్రతల రక్షణే ప్రధాన లక్ష్యం
రుద్రంగి ఎస్‌ఐగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ..శాంతి భద్రతల రక్షణే ప్రధాన లక్ష్యం
by Bhanu |
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి కొత్తగా నియమితులైన ఎస్‌ఐ శ్రీనివాస్ శుక్రవారం విధుల్లో చేరారు.

X
దిశ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి కొత్తగా నియమితులైన ఎస్‌ఐ శ్రీనివాస్ శుక్రవారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, మత్తు పదార్థాల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సందర్భాల్లో 100 నంబర్‌కు ఫోన్ చేయాలనీ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
Next Story






