- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > హనుమాన్ విగ్రహం గద్దెలను కూల్చే ప్రయత్నం.. ఆర్టీసీ అధికారుల పై ఎంపీ ఫైర్
హనుమాన్ విగ్రహం గద్దెలను కూల్చే ప్రయత్నం.. ఆర్టీసీ అధికారుల పై ఎంపీ ఫైర్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్టాండ్ ఇన్ గేట్ వద్ద గల పురాతన హనుమాన్ దేవాలయ గోడలు కూలడంతో నూతనంగా గద్దెలను, గోడలను నిర్మించారు.

X
దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్టాండ్ ఇన్ గేట్ వద్ద గల పురాతన హనుమాన్ దేవాలయ గోడలు కూలడంతో నూతనంగా గద్దెలను, గోడలను నిర్మించారు. అయితే గురువారం రాత్రి మెట్ పల్లి ఆర్టీసీ అధికారులు నూతన గద్దెలను, గోడలను తొలగించేందుకు యత్నించగా ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు ఆర్టీసీ అధికారులతో కూల్చివేత ఆపాలని వాగ్వాదానికి దిగారు. జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్ పల్లికి చేరుకొని సమస్య పెద్దది చేయవద్దని యధావిధిగా కొనసాగించాలని మీ పని బస్సులు నడపడమే తప్ప ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారాదని ఆర్టీసీ అధికారులపై ఆగ్రహించారు. దేవాలయం యధాతథంగా కొనసాగుతుందని భక్తులకు ఎంపీ అర్వింద్ హామీ ఇవ్వడంతో శాంతించిన హిందూ సంఘాల నేతలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story






