ఆర్టీసీ బస్సు, లారీ ఢీ... పలుగురికి తీవ్ర గాయాలు

by velandi.Saikiran |

ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తంగళ్ళపల్లి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ... పలుగురికి  తీవ్ర గాయాలు
X

దిశ, తంగళ్లపల్లి: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో సిద్దిపేట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సిరిసిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి, తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి ఆరా తీశారు.

Next Story