- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
79 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు రూ.9.64 కోట్ల..
నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

79 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు రూ.9.64 కోట్ల..
- 48 అంగన్వాడీ కేంద్రాల్లో మరమ్మత్తులకు రూ.96 లక్షలు
- నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు
దిశ, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం,రామగిరి, కమాన్ పూర్ పాలకుర్తి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ స్పెషల్ మరమ్మత్తులకు రూ.10 కోట్ల 60 లక్షల నిధులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని, ముత్తారం,కమాన్ పూర్, పాలకుర్తి మండల్లాల్లోని 79 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన అభివృద్ది (Special Repairs & Infrastructure, Other Works) పనులకు గాను రూ.9 కోట్ల 64 లక్షలు, 48 అంగన్వాడి కేంద్రాల రిపేర్లకు రూ.96 లక్షల డీఎంఎఫ్టీ నిధుల నుండి మంత్రి శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని, ముత్తారం, కమాన్ పూర్ మరియు పాలకుర్తి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన స్పెషల్ రిపేర్స్, అంగన్వాడీ రిపేర్ వర్క్స్ కు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. మంథని నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వసతులు, కంప్యూటర్ ల్యాబ్స్, నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథని, ముత్తారం,కమాన్ పూర్, పాలకుర్తి మండలాల్లో మంజూరైన ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీల సంబంధించిన గ్రామాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
- Tags
- Telugu News






