- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుద్దెనపల్లిలో దొంగల బీభత్సం
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని శుక్రవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డ సంఘటన సైదాపూర్

దిశ, సైదాపూర్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని శుక్రవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డ సంఘటన సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బోరగళ్ళ నరసవ్వ అనే మహిళ ఇంటికి తాళం వేసి, గురువారం చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బంధువుల ఇంటికి ఓ శుభకార్యానికి వెళ్లింది.
అలాగే మరో వ్యక్తి బోరగల్ల రాజయ్య ఇంటికి తాళం వేసి, హైదరాబాద్ వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉన్న దానిని గమనించి దొంగలు తెల్లవారుజామున ఇంటి తాళాలను ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టారు. బీరువాలో, ఇంట్లో విలువైన సమానులు లేకపోవడంతో బీరువాలో ఉన్న బట్టలను చిందరవందరగా పడేశారు. అలాగే పెద్దమ్మ గుడి సమీపంలో బోల్లి నరేష్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తుండగా నిర్మాణం చేసే ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దొంగలు సీసీ కెమెరాను, గృహ నిర్మాణానికి ఉపయోగించుకునే ప్లంబింగ్ పైపులు, ఎలక్ట్రికల్స్ సామాగ్రిని ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






