రోడ్డు భద్రత నియమాలు క‌చ్చితంగా పాటించాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-10 09:06:01  IST  )

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు క‌చ్చితంగా పాటించి సురక్షితంగా తమ గమ్య స్థానాలను చేరుకోవాలని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

రోడ్డు భద్రత నియమాలు క‌చ్చితంగా పాటించాలి :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, చొప్పదండి : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు క‌చ్చితంగా పాటించి సురక్షితంగా తమ గమ్య స్థానాలను చేరుకోవాలని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు సభ సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రోడ్డు సేఫ్టీ ఐజీ రమేష్ నాయుడు, సీపీ గౌస్ ఆలం,అడిషనల్ కలెక్టర్ అశ్వని తానాజీ వాకడే హాజరై మాట్లాడారు. సహజ మరణాల తర్వాత రోడ్డు ప్రమాద మరణాలు అధికంగా జరుగుతున్నాయని నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అన్నారు.

వాహనదారులు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉండాలని అన్నారు. మైనర్ లు వాహనాలు నడపకూడదని, త్రిబుల్ రైడింగ్ చేయకూడని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు క్షతగాత్రులను సరైన సమయంలో ఆసుపత్రికి తరలించి విలువైన ప్రాణాలను కాపాడాలని సూచించారు. అలాంటి సమయంలో కాపాడిన వారి కోసం ప్రభుత్వం రహవీర్ పతకం ను వర్తింప జేయనుందని పేర్కొన్నారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించి రోడ్డు భద్రత పాటించాలని ప్రతిజ్ఞ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొత్తూరి మహేష్, కమిషనర్ నాగరాజు, ఏసీపీ విజయ్ కుమార్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ నరేష్ రెడ్డి, తహశీల్దార్ నవీన్ కుమార్, ఎంపీ డీఓ వేణుగోపాల్ రావు, కౌన్సిలర్ పాల్గొన్నారు.

Next Story