ప్రతి గిరిజన తండాకు రోడ్డు సౌకర్యం

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-24 11:30:10  IST  )

రాష్ట్రం లోని ప్రతి గిరిజన తండాకు రహదారుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ప్రతి గిరిజన తండాకు రోడ్డు సౌకర్యం
X

ప్రతి గిరిజన తండాకు రోడ్డు సౌకర్యం

గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి కృషి

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్

దిశ, పెగడపల్లి : రాష్ట్రం లోని ప్రతి గిరిజన తండాకు రహదారుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలో పర్యటించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ మండలంలోని కీచులాటపల్లి గ్రామం నుండి ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం వరకు ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో నిర్మించతలపెట్టిన రహదారి నిర్మాణం పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు రహదారి నిర్మాణం వల్ల ఎదుర్కుంటున్న సమస్యలను తెల్పగా రైతుల అభీష్టం మేరకే రహదారి నిర్మాణం చేపడతామని రహదారి నిర్మాణం వల్ల ఏ ఒక్క రైతులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నాది అని ప్రతి గిరిజన తండాకు రహదారి నిర్మాణం తో పాటుగా తండాల్లో సంక్షేమ భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

ఏ సమస్య ఉన్నా నేరుగా కలవండి..

అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో 78 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 16,87,500 విలువ గల సీఎం సహాయనిధి చెక్కుల తో పాటుగా నాలుగు నెలల క్రితం విద్యుత్ షాక్ తో మరణించిన నంచర్ల గ్రామానికి చెందిన ఎడ్ల రాజేందర్ రెడ్డి మరణించగా విద్యుత్ శాఖ నుండి వచ్చిన అయిదు లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.అనంతరం మాట్లాడుతూ ప్రతి పేదవారికి కార్పోరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పదిలక్షల వరకు పరిమితి పెంచామని ఆరోగ్యశ్రీ కిందకు రాని వైద్యం చేసుకున్నవారికి ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద ఆర్ధిక సాయం అందజేస్తున్నామని సీఎం సహాయనిధి పేదలకు వరం అని అన్నారు.ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న నేరుగా నన్ను కలవచ్చు అని మీలో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఎస్ఈ సుదర్శనం, ఏడీఈ వరుణ్ కుమార్, డీసీఓ మనోజ్ కుమార్, తహశీల్దార్ ఆనంద్ కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, నాయకులు సంధి మల్లారెడ్డి, కడారి తిరుపతి, అమీరిశెట్టి మల్లా రెడ్డి, పూసల తిరుపతి, మందపల్లి అంజయ్య, కుంచె రాజేందర్, కొండా మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

Next Story