పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్ప‌గింత : ఎస్సై చంద్ర‌కుమార్

by Ratna Kumari |

దిశ, సుల్తానాబాద్ : పోగొట్టుకున్న ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితునికి అప్పగించిన సుల్తానాబాద్ పోలీసులు. సుల్తానాబాద్ స్టేషన్ పరిధిలోని సుగ్లంపల్లి గ్రామానికి చెందిన చిట్టవేణి

పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్ప‌గింత : ఎస్సై చంద్ర‌కుమార్
X

దిశ, సుల్తానాబాద్ : పోగొట్టుకున్న ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితునికి అప్పగించిన సుల్తానాబాద్ పోలీసులు. సుల్తానాబాద్ స్టేషన్ పరిధిలోని సుగ్లంపల్లి గ్రామానికి చెందిన చిట్టవేణి లచ్చయ్య ఫోన్ పోగొట్టుకోని, సుల్తానాబాద్ పోలీసు వారికి కంప్లైంట్ చేయగా వారు సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి సోమవారం బాధితునికి ఫోన్ ని అందజేసారు. ఈ సందర్భంగా ఎస్సై చంద్ర కుమార్ మాట్లాడుతూ ఎవరైనా వారి సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోగలరని, ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, ఈఅవకాశంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Next Story