- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో రిటైర్డ్ డీఎస్పీ మృతి
by velandi.Saikiran |
వీణవంక మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ డిఎస్పి గడ్డం రామస్వామి గౌడ్(76) అనారోగ్యంతో మృతి చెందాడు.

X
దిశ, వీణవంక: వీణవంక మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ డిఎస్పి గడ్డం రామస్వామి గౌడ్(76) అనారోగ్యంతో మృతి చెందాడు. రామస్వామి గౌడ్ మృతితో వీణవంక మండలంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రామస్వామి గౌడ్ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరి డిఎస్పి వరకు అంచలంచెలుగా ఎదిగారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎస్ వేణుగోపాలచారి వద్ద కొన్ని రోజులపాటు సీఐ గా విధులు నిర్వహించాడు. రామస్వామి గౌడ్ కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడని మండల ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఇక శుక్రవారం వీణవంకలో జరిగిన రామస్వామి గౌడ్ అంత్యక్రియలలో తన బ్యాచ్ మేట్స్, వీణవంక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story






