దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. వైన్స్ షాపు త‌నిఖీ

by Nallavelli.Anjaneyulu |

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండ‌ల కేంద్రంలో తాజ్ లాల్ వైన్స్ షాపు లో శ‌నివారం టుబోర్గ్ బీరు సీసా పై కింగ్ ఫిష‌ర్ స్టిక్క‌ర్ వేసి విక్ర‌యిస్తున్నార‌ని క‌థ‌నాన్ని శ‌నివారం దిశ దిన ప‌త్రిక‌లో ప్ర‌చురించారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. వైన్స్ షాపు త‌నిఖీ
X

దిశ‌, గంభీరావు పేట : రాజ‌న్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండ‌ల కేంద్రంలో తాజ్ లాల్ వైన్స్ షాపు లో శ‌నివారం టుబోర్గ్ బీరు సీసా పై కింగ్ ఫిష‌ర్ స్టిక్క‌ర్ వేసి విక్ర‌యిస్తున్నార‌ని క‌థ‌నాన్ని శ‌నివారం దిశ దిన ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. మంగ‌ళ‌వారం ఎక్సైజ్ అధికారులు స్పందించారు. తాజ్ లాల్ వైన్స్ షాపు ను ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ త‌నిఖీ చేశారు. అనంత‌రం మ‌ద్యం సీసాల‌ను ప‌రిశీలించారు. కొన్ని మ‌ద్యం సీసాల‌ను డిల్యూష‌న్ కిట్ ద్వారా ప‌రిశీలించి ఎలాంటి క‌ల్తీ జ‌రుగ‌లేద‌ని నిర్థారించారు. మండ‌లంలో వైన్ షాపుల్లో ఎక్క‌డైనా క‌ల్తీ జ‌రిగింద‌ని తెలిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు. ఈ విష‌యం పై విచార‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు.

Next Story