దిశ కథనానికి స్పందన.. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

by Nallavelli.Anjaneyulu |

ఇసుక అక్రమ రవాణా పై దిశ దిన పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం.. అనే శీర్షికన దిశ దిన పత్రికలో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.

దిశ కథనానికి స్పందన.. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
X

దిశ‌, తంగ‌ళ్ల‌ప‌ల్లి : ఇసుక అక్రమ రవాణా పై దిశ దిన పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం.. అనే శీర్షికన దిశ దిన పత్రికలో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. సిరిసిల్ల ఆర్డీవో తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఇసుక రవాణా విషయమై ఆరా తీశారు. అనంతరం ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్ లను కార్యాలయానికి పిలిపించి ఇసుక రవాణా విషయమై పలు సూచనలు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మండలంలోని మానేరు వాగును రెవెన్యూ అధికారులు సందర్శించి ఇసుక రవాణా పై వివరాలు సేకరించారు.

Next Story