కాళేశ్వరం జలాలు రాకున్నా రికార్డ్ స్థాయిలో పంటలు: మంత్రి పొన్నం

by Bhanu |

తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు, దొడ్డు వడ్లు వెంట వెంటనే కొనుగోలు చేస్తుందనీ రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

కాళేశ్వరం జలాలు రాకున్నా రికార్డ్ స్థాయిలో పంటలు: మంత్రి పొన్నం
X

దిశ, వేములవాడ: తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు, దొడ్డు వడ్లు వెంట వెంటనే కొనుగోలు చేస్తుందనీ రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు లతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో వేములవాడ అర్బన్ మండల తహశీల్దార్ కార్యాలయం నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుద్రంగి పర్యటనకు వెళ్తున్న తరుణంలో మధ్యలో వేములవాడ నుండి కాన్ఫరెన్స్లో. పాల్గొన్నట్లు తెలిపారు.


అధిక తూకం లేకుండా, ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా, గోనె సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా 48గంటల్లోనే డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ అన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని, కాళేశ్వరం జలాలు రాకున్నా ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని పండించడం, పండించిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందనీ అన్నారు. పంట ఎండిపోయింది అనే అవకాశం లేకుండా విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, తమది రైతుల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో

Next Story