- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం జలాలతో రసమయి బాలకిషన్ వినూత్న నిరసన
కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు.

దిశ, తిమ్మాపూర్ : కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి లోని అమరవీరుల స్థూపాన్ని రసమయి బాలకిషన్... బిఆర్ఎస్ నాయకులతో కలిసి కాళేశ్వరం జలాలతో శుద్ధి చేశారు. అనంతరం పిసి గోష్ కమిటీ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్ట్‌ను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కాళేశ్వరం కూలిందని చెబితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎట్లా వచ్చాయని మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మోటార్లతో నీటిని ఎత్తిపోసింది కూడా కాళేశ్వరంలో భాగమే కదా అన్నారు. ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోగా అబద్ధపు ప్రచారంతో బీఆర్ఎస్ పై బురద జల్లే రాజకీయాలు కాంగ్రెస్ మానుకోవాలన్నారు.
రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో యూరియా కొరతను లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిద్ధం వేణు, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, గడ్డం నాగరాజు, మండల అధ్యక్షుడు రావుల రమేష్, పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






