పోలీస్ శాఖలో కలకలం..జమ్మికుంట ఎస్ఐపై రేప్ కేసు నమోదు!

by Malleboina Mahesh |

జమ్మికుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్‌పై లైంగిక దాడి కేసు నమోదు! ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధించినట్లు ఫిర్యాదు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎస్ఐ.

పోలీస్ శాఖలో కలకలం..జమ్మికుంట ఎస్ఐపై రేప్ కేసు నమోదు!
X

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పని చేసిన ఓ సబ్ ఇన్​స్పెక్టర్​వివాదాలకు కేరాఫ్​అడ్రస్ గా నిలుస్తున్నారు. ఖద్దరు నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న సదరు ఎస్ఐ కాంట్రావర్సీ వ్యవహారాలు పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో పోలీస్ బాస్‌లకే సవాల్ విసురుతూ పోస్టింగులు కొట్టేస్తున్న సదరు ఎస్ఐ గతంలో పనిచేసిన స్టేషన్లలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. దీంతో నేరుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సదరు ఎస్ఐ‌ని సస్పెండ్ చేయడం తో పోలీస్ బాస్ నే ఇరకాటంలో పడేసేలా వ్యవహరించి పోలీస్ వర్సెస్​పొలిటికల్ అనే వివాదానికి కారకుడయ్యాడు. ప్రస్తుతం పదిహేను రోజుల క్రితం జమ్మికుంట ఎస్ ఐ గా విధుల్లో చేరి తాజాగా ఓ మహిళను వేధిస్తున్న కేసులో ఇరుక్కోవడం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కాంట్రవర్సీ ఖాకీ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది

ఖాకీలే కీచకులైతే

ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళ పట్ల ఎస్ ఐ లైంగిక దాడికి పాల్పడటం పోలీసు శాఖలో కలకలం రేపుతూ ఖాకీలు కీచకులుగా మారితే ఇక మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లేది ఎలా అనే ప్రమాదకర పరిస్థితి నెలకొన్నాయి. ఒకటి కాదు రెండు కాదు తప్పుల మీద తప్పులు చేస్తుంటే అలాంటి ఖాకీలను ఇంకా పోలీస్ శాఖలో కొనసాగించడం అవసరమా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

కాంట్రవర్సీ పోలీస్ అధికారి

ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ వ్యవహారం పోలీసు శాఖకు తలనొప్పిగా మారింది. ఓ పోలీస్ స్టేషన్ కి అధికారిగా ఉన్న ఆయనపై ఇటీవల జిల్లా స్థాయి అధికారి విచారణ జరిపి చర్యలు చేపట్టి సస్పెండ్ చేశారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఇటీవల ఓ పోలీస్ స్టేషన్​లో ఆయనపై మహిళా ఓ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నేరస్తులను పట్టుకోవాల్సిన అధికారి నేరస్తుడిగా తప్పించుకుని తిరుగుతున్నాడు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిరిసిల్ల జిల్లాలో ఆయన స్టేషన్ లో పని చేసినప్పుడు ఆయన నిర్ణయాలు కొందర్ని ఇబ్బంది పెట్టాయి. కరీంనగర్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్​లో ఆయన వైఖరి పై విమర్శలు రావడంతో జిల్లా ఉన్నత అధికారి విచారణ జరిపించి సస్పెండ్ చేశారు.

అయితే తనకున్న రాజకీయ నేతల అండదండలను వాడుకొని ఏకంగా ఉన్నతాధికారుల పైన విమర్శలు చేయించినట్లు వినికిడి. సస్పెండ్ అయిన అధికారిని కాపాడుకునేందుకు సదర్ నేతలు చేయని ప్రయత్నాలు లేకపోగా ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఉన్నతాధికారిని బదిలీ చేయించే ప్రయత్నం చేసి విఫలమైనట్లు చర్చ సాగింది. ఎట్టకేలకు సస్పెండ్ ఎత్తివేయడంతో జిల్లాలోనే ఎస్‌హెచ్వో గా ఉన్న ఓ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఫేస్ బుక్ లో పరిచమయిన పక్క జిల్లాలో ని ఓ మహిళ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అతనిపై కేసు నమోదు కావడంతో సదరు అధికారి తీరులో మార్పు రాలేదని సంబంధిత శాఖలో విమర్శలు మొదలయ్యాయి.

Next Story