మామిడిపల్లిలో వైభవోపేతంగా రాములోరి జాతర

by Ratna Kumari |

సిరిసిల్ల జిల్లా కోన‌రావుపేట మండ‌లంలోని మామిడిప‌ల్లి గ్రామంలో వైభ‌వోపేతంగా రాములోరి జాత‌ర ప్రారంభం అయింది.

మామిడిపల్లిలో వైభవోపేతంగా  రాములోరి జాతర
X

దిశ, కోనరావుపేట : సిరిసిల్ల జిల్లా కోన‌రావుపేట మండ‌లంలోని మామిడిప‌ల్లి గ్రామంలో వైభ‌వోపేతంగా రాములోరి జాత‌ర ప్రారంభం అయింది. సీతారామ‌స్వామి జాత‌ర అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మ‌హేష్ గీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయంగా ఉన్న ఈ సీతారామ చంద్ర స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఈ భక్తుల కోరిక మొక్కులు నెరవేర్చే కొంగు బంగారంగా అమ్మవారి సమేత శ్రీ సీతారామస్వామి కొలువుదిగిన పుణ్య క్షేత్రం అని పేర్కొన్నారు. ఈ మామిడిపల్లి జాతరకు చుట్టుపక్కల మండలాల నుంచి వ‌స్తార‌ని.. అలాగే నిజామాబాద్ జిల్లా ప్రాంతం నుంచి కూడా మొత్తం దాదాపు 20 వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంద‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ఏర్పాట్లు

భ‌క్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజన్న ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేలా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో భక్తులు కాలినడకన, ఎడ్లబండ్ల మీద ఈ జాతరకు వచ్చేవారని, ప్రస్తుతం రవాణా సౌకర్యాలు పెరగడంతో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, భక్తులందరికీ మాఘ అమావాస్య జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ పవిత్ర - సురేష్, వట్టిమల్ల ఉపసర్పంచ్ గంగారం సంపత్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story