ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి

by Bhanu |   (  Updated:2025-05-16 11:17:11  IST  )

ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి
X

దిశ, గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా, హెడ్ కానిస్టేబుల్ లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి పొందారు. శుక్రవారం అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా కార్యాలయంలో అభినందింఛి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి మాట్లాడారు. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వ‌స్తుంద‌ని ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆర్ఐ అడ్మిన్ దామోదర్, సిబ్బంది పాల్గొన్నారు.




Next Story