- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న ఆలయ ఈవోగా రమాదేవి నియామకం
by velandi.Saikiran |
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ.ఓ గా ఎల్.రమాదేవిని నియమిస్తూ గురువారం సాయంత్రం దేవాదాయ

X
దిశ, వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ.ఓ గా ఎల్.రమాదేవిని నియమిస్తూ గురువారం సాయంత్రం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం భద్రాచలం రామాలయం ఈ.వోగా పని చేస్తున్న రమాదేవి... 2022 జనవరి 17 నుండి కొద్దిరోజుల పాటు వేములవాడ ఆలయ ఈ.వోగా పని చేసి పాలనలో తనదైన ముద్ర వేసింది. ఈ క్రమంలో మరోసారి తిరిగి రాజన్న ఆలయ ఈ.వోగా వస్తుండటంతో రాజన్న భక్తులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో పాలన సక్రమంగా సాగడమే కాకుండా త్వరలో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులు సైతం శరవేగంగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






