ఆరోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

by Bhanu |

ధర్మపురి మండలంలోని రాజారం గ్రామానికి చెందిన బొల్లి పెద్ద లింగం (వయసు సుమారు 50) అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆరోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, వెల్గటూర్ : ధర్మపురి మండలంలోని రాజారం గ్రామానికి చెందిన బొల్లి పెద్ద లింగం (వయసు సుమారు 50) అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆరు సంవత్సరాలుగా బీపీ, షుగర్, వాతం వంటి వ్యాధులతో అతను బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మున్ముందు చికిత్సలు భరించలేనన్న భావనతో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పురుగుల మందు సేవించి ఇంటికి తిరిగి వచ్చాడు.

ఆయన భార్యకు ఈ విషయం చెప్పిన వెంటనే కుటుంబసభ్యులు అతన్ని అత్యవసరంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య బొల్లి సత్తవ్వ ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Next Story