- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
gift : రాజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే చీర బహుమానం
by Sridhar Babu |
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాతో పాటు చీరను బహుమానంగా అందజేశాడు.

X
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాతో పాటు చీరను బహుమానంగా అందజేశాడు. తానే స్వయంగా నేసిన వీటిని మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆలయ ఈఓ కె. వినోద్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు విజయ్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. వారి వెంట ఈఓ సీసీ ఎడ్ల శివ, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
- Tags
- gift
Next Story






