రాజన్న హుండీ ఆదాయం రూ.2 కోట్ల 19 లక్షలు

by velandi.Saikiran |

దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీలను శుక్రవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కించారు

రాజన్న హుండీ ఆదాయం రూ.2 కోట్ల 19 లక్షలు
X

దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీలను శుక్రవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కించారు. 36 రోజులకు సంబంధించిన హుండీలను విప్పి లెక్కించగా స్వామివారికి రూ.2 కోట్ల,19 లక్షల,35 వేల,165నగదు, 124.5 గ్రాముల మిశ్రమ బంగారం, 10.5కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈ.వో ఎల్.రమాదేవి తెలిపారు. ఈ లెక్కింపులో ఏ.సీ కార్యాలయ పరిశీలకుడు ఎం.రాజమౌళితో పాటు ఆలయ ఏ.ఈ ఓ.లు, పర్యవేక్షకులు, సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story