ప్ర‌మాద‌క‌ర టిప్ప‌ర్ల పై ప్ర‌జ‌ల ఆందోళ‌న

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో నల్ల మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందుల‌ను కలిగిస్తున్నాయి.

ప్ర‌మాద‌క‌ర టిప్ప‌ర్ల పై ప్ర‌జ‌ల ఆందోళ‌న
X

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో నల్ల మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందుల‌ను కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నియమాలను పట్టించుకోకుండా, ఓవర్ లోడ్‌తో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఈ వాహనాలు రహదారులపై ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. గ్రామాల మధ్య రహదారులు దెబ్బతింటూనాయని, పాదచారులు వాహనదారులు ప్రాణ భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిర్లక్ష్యంగా నడుస్తున్న ఈ వాహనాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు, “ప్రమాదం జరిగే లోపు చర్యలు తీసుకోవాలని ,పరిమితి లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలి” అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం వల్లే ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. వాహనాలపై కఠిన తనిఖీలు జరిపి, ఓవర్‌లోడ్ వాహనాలను తక్షణమే నిలిపివేయాలని, గ్రామీణ రహదారులపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. `

Next Story