Additional Collector : ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి..

by Batti.Sumithra |

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

Additional Collector : ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారని తెలిపారు. కాగా ఆయా శాఖల నుంచి మెత్తం 101 దరఖాస్తులు రాగా, రెవెన్యూ శాఖకు 52, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 11 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story