- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్న తండ్రి నుంచి కాపాడండి.. ప్రజావాణిలో కూతురు ఫిర్యాదు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకనపెళ్లి కి చెందిన జెస్సికా తన తండ్రి, సోదరునితో ప్రాణాపాయం ఉందని సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసింది. తన తండ్రి సామెల్ మొదటి భార్య మరణించగా

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకనపెళ్లి కి చెందిన జెస్సికా తన తండ్రి, సోదరునితో ప్రాణాపాయం ఉందని సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసింది. తన తండ్రి సామెల్ మొదటి భార్య మరణించగా మందమర్రి కి చెందిన మా అమ్మ శకుంతలను సంప్రదాయ పద్ధతిలో పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నాడని.. అప్పటికే మొదటి భార్య కు ఒక కుమారుడు ఉన్నాడు, మా అమ్మకు పెళ్లిలో బంగారం వెండి వస్తువులు నాన్న అమ్మకు ఇస్తా అని ఒప్పుకున్నాడు. అవ్వి ఇవ్వక పోగా మా అమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కూడా లాక్కున్నారు.
పెళ్లి అయిన తరువాత కొద్ది రోజులకు ఆ బంగారం కోసం అడిగినప్పటి నుంచి టార్చర్ పెడుతున్నారు. ఆమె గర్భిణీ గా ఉన్నప్పటి నుండి మొదటి భార్య కుమారుడైనా రాజు మా నాన్న ఇద్దరు కలిసి కొట్టేవారని నేను పుట్టిన తరువాత మీ ఇద్దరు వద్దు అంటూ రోజు శారీరకంగా, మానసికంగా వేదించి ఇంట్లో నుండి మమ్మల్ని గేంటేశారంటూ వాపోయింది. ఇప్పుడు నేను 10తరగతి చదువుతున్నాను. నా చదువు కు ఇల్లు గడవడానాకి కష్టంగా ఉంది. అంతే కాకుండా మా నాన్న పేరు మీద ఉన్న ఎకరం 20 గుంటల భూమికి మీకు సంబంధం లేదని, చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని ప్రజావాణి లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త విన్న వారందరూ ఆశ్యర్యపోతున్నారు.






