- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు అంజన్న ఆలయంలో అర్చకుల నిరసన
రాష్ట్ర ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, కొండగట్టు : రాష్ట్ర ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు వైఖరికి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం ఆలయ అర్చకులు రాజగోపురం ముందు ధర్నాకు దిగారు.ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఒకేసారి గుంపుగా ఆలయంలోకి ప్రవేశించడంతో ఆలయ ఈవో అర్చకులను మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అర్చకులకు ఈవోకు మధ్య వివాదం నెలకొంది వివాదం నెలకుంది. అర్చకుల ఆరోపణల ప్రకారం…ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ, అర్చకులను జిల్లా స్థాయి అధికారులను సైతం దుర్భాషలాడుతున్నట్లు ఆరోపించారు. ఈవో తీరు కారణంగా ఆలయ అర్చకులకు ఉద్యోగులకు మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు తెలిపారు. ఈవోపై తక్షణ విచారణ చేపట్టాలని, ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అర్చకుల నిరసన కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించి భద్రత కట్టు దిట్టం చేశారు. ఇదిలా ఉండగా ఆలయ ఈఓ గా శ్రీకాంతరావు బాధ్యతలు చేపట్టినప్పుటి నుండి ఆలయ ఆదాయం ఘననీయంగా పెరిగిందని సిఫారసులకు తావు లేకుండా సంస్కరణలు తీసుకువచ్చినట్లు భక్తులు తెలిపారు.






