- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం పరిధిలోనే యూరియా అంశం
తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి, పేద గ్రామీణ వ్యవసాయం కుటుంబం నుండి వచ్చి హైకోర్టు , సుప్రీం కోర్టు

దిశ, కరీంనగర్ టౌన్ : తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి, పేద గ్రామీణ వ్యవసాయం కుటుంబం నుండి వచ్చి హైకోర్టు , సుప్రీం కోర్టు జడ్జి గా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ డిసీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గోడ మీద ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలని సూచించారు. వాళ్లకు అలాగే బీజేపీ వెంట వెళ్తారా...? తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి గా ఇండియా కూటమి వెంట వస్తారా వారి విజ్ఞత కి వదిలేస్తున్నామన్నారు. యూరియా ఎవరు ఇస్తే వారికి ఓటు వేస్తామని కేటీఆర్ చెప్తున్నారని, 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఆయనకు యూరియా ఎవరు ఇస్తారు తెలియదా అని ప్రశ్నించారు. యూరియా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందని, తెలంగాణ కి వివక్ష పూరితంగా ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వాన్ని బదనం చేయాలని చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ లో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు,సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు పంపిణీ, సన్న వడ్లకు 500 బోనస్ ,60 వేల ఉద్యోగాలు ,9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా ,60 వేల ఉద్యోగాలు,గురుకుల మెస్ చార్జీలు పెంచాం,అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూసి ఓర్వలేకే బధనం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. యూరియా విషయంలో బీఆర్ఎస్ నాయకులు రైతులను భయబ్రాంతులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎరువుల విషయాలలో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ చూపించాలని ఆయన కోరారు. ఎవరు లేకున్న.. టిఆర్ఎస్ నాయకులు చెప్పులు లైన్ లో పెట్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, విద్యుత్ పై బాధ్యత వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి,పార్లమెంట్ సభ్యులు, వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత పై కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి కి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అన్ని పార్టీలను కోరారని చెప్పారు. సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ.. ఆయనకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం కి సంబంధించి రెండో టీఎంసీ ఎప్పుడు రాలేదని స్పష్టం చేశారు.మీరు గత 10 సంవత్సరాలుగా ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రెండో టీఎంసీ కి గతిలేదు..మూడో టీఎంసీ పనులు ఎందుకు ప్రారంభించారు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో ఎవరి ఇళ్లలో వాళ్లు ఓట్లు ఉన్నాయో చూసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం వివక్ష పూరితంగా వ్యవహరిస్తుందని, ఎన్నికల సంఘం బీజేపీ కి అనుబంధంగా పని చేస్తుందని విమర్శించారు.






