- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో పైపులు, గడ్డివాము దగ్దం
by Ratna Kumari |
విద్యుత్ షాక్ సర్క్యూట్ తో పైపులు, గడ్డివాము దగ్దం అయిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, హుజురాబాద్ : విద్యుత్ షాక్ సర్క్యూట్ తో పైపులు, గడ్డివాము దగ్దం అయిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కపల్లి గ్రామానికి చెందిన అర్కాల మల్లయ్య, అర్కాల రవిందర్ అనే ఇద్దరు అన్నదమ్ములు రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద పశువుల కోసం గడ్డివాము ఏర్పాటు చేసుకున్నారు. అలాగే విద్యుత్ మోటార్లకు సంబందించిన పైపులు వ్యవసాయ పొలం వద్ద ఉండగా.. మంగళవారం ఎండల తీవ్రతకు విద్యుత్ తీగలు షాక్ సర్క్యూట్ కారణంగా పైపులు, గడ్డివాము పూర్తిగా దగ్దం అయ్యాయి. సుమారుగా లక్ష విలువ చేసే పైపులు, గడ్డివాము దగ్దం కావటంతో రైతులు బోరున విలపించారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Next Story






