- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దపల్లి మండల పరిధిలోని గొల్లపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, పెద్దపల్లి టౌన్: పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దపల్లి మండల పరిధిలోని గొల్లపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆవుల మహేష్ (30) అనే వ్యక్తి సాయంత్రం వరి ధాన్యం పోసిన కల్లం వద్దకు వెళ్లి ధాన్యం తడుస్తుందని టార్పాలిన్ సరి చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఉరుములు మెరుపులతో కురిసిన వానతో పాటు అకస్మాత్తుగా ఆ రైతుపై పిడుగు పడింది. విగత జీవిగా మారిన కొడుకును చూసి తన తండ్రి రాములు బోరున విలపించాడు. చుట్టు ప్రక్కల వారు గమనించి మహేష్ పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. యువ రైతు మృతి తో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






