ఎన్నికలు జరిగేనా.. పల్లెల్లో ఇప్పుడిదే చర్చ

by Ajay Maddhiboyina |

ఎన్నికలు అంటే పల్లెల్లో నేతల హడావిడి, జనం నాడి పట్టేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు, అనుచరుల ప్రచారం, పోటా పోటీ హామీ లు, రచ్చబండలు వీధి గుమ్మాల్లో ముచ్చట్లు ఇలా పల్లెలు సందడిగా మారిపోతాయి. కానీ ఈ సారి పల్లెల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

ఎన్నికలు జరిగేనా.. పల్లెల్లో ఇప్పుడిదే చర్చ
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ఎన్నికలు అంటే పల్లెల్లో నేతల హడావిడి, జనం నాడి పట్టేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు, అనుచరుల ప్రచారం, పోటా పోటీ హామీ లు, రచ్చబండలు వీధి గుమ్మాల్లో ముచ్చట్లు ఇలా పల్లెలు సందడిగా మారిపోతాయి. కానీ ఈ సారి పల్లెల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు సమావేశాలు అభ్యర్థుల ఎంపిక చేయడం లో బిజీ బిజీగా ఉన్న పోటీ చేసే అభ్యర్థుల్లో మాత్రం ఆ స్పీడ్ కనిపించకపోగా ప్రతి చోట ఎన్నికలు జరుగుతాయా.. అంటు సందేహాలు వ్యక్తం కావడంతో పల్లెలు ఎన్నికల సందడి సంతరించుకోవడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .

ఎన్నికలు జరుగుతాయా..?

ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు రిజర్వేషన్లు ఖరారు చేయగా ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం విధితమే అయినప్పటికీ అభ్యర్థుల్లో ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనే సందేహాలు మాత్రం తొలగడం లేదు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ ‘ఏ’ ప్లాన్‘బి’ఉందంటూ కోర్టులో వేసిన అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ స్పష్టం చేస్తున్న పల్లెల్లో విశ్వాసం కలగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి ఈ నెల 9 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభం అవుతుంది అంటు ఘంటా పథంగా చెప్పిన అప్పటి వరకు చూద్దాంలే అనే ధోరణిలో అభ్యర్థులు ఉండటం చేత పల్లెల్లో ఎక్కడ చూసిన రచ్చబండల వద్ద, వీధి గుమ్మాల వద్ద ఎన్నికలు జరుగుతాయంటనా.. కోర్టులో కేసు నడుస్తుందంట కదా, కోర్టు తీర్పు వచ్చేదెన్నడు ఓట్లు జరిగేది ఎన్నడంటూ ముచ్చట్లు జోరందుకున్నాయి .

గెలిచే అభ్యర్థుల వేటలో పార్టీలు

ఎన్నికలు జరిగితే మన పార్టీ బలపరచిన అభ్యర్థే గెలిచేలా వ్యూహరచన చేయాలంటూ రాజకీయ పార్టీల అధిష్టానాలు ఆదేశించడంతో పలు పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పోటీ చేసేందుకు ఎవరెవరు ఉత్సాహంగా ఉన్నారు. గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. అభ్యర్థిగా ఎవరిని పార్టి బలపరచిన అందరూ ఐక్యంగా ఉండి గెలిపించాలంటు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నికల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఖర్చుపెట్టికోవద్దంటూ హెచ్చరిస్తూ పక్క రాష్ట్రాల్లో పరిస్థితిని తెలపడంతో పోటీలో ఉండే అభ్యర్థులు పార్టీల స్పీడ్ కు తగ్గట్టుగా స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే ఎలా అని ముందస్తుగా గెలిచే అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేసి పార్టీ నాయకత్వానికి పంపిస్తున్నారు

క్యాడర్ ను కాపాడుకునేందుకే పాట్లు

స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితిలో క్యాడర్ కాపాడుకోవడమే ప్రధాన ఎజెండాగా పార్టీలు వ్యవహరించక తప్పని పరిస్థితి. క్యాడర్ తమ పార్టీని వీడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటునే పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి . అందుకోసం గెలిచే అభ్యర్థులు ఎవరు ఎవరిని బలపరిస్తే గెలిచే అవకాశం ఉందంటూ సమాచారాన్ని రాబడుతూ పోటీలో ఉండేందుకు ఉత్సాహం కనబరుస్తున్న వారి వివరాలను అధిష్టానానికి పంపిస్తున్నాయి. అందుకోసం మండల, గ్రామ స్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం తగ్గకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి

Next Story