- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిఫిన్ సెంటర్‌లపై కొరడా.. జరిమానా విధింపు
by Sathputhe Rajesh |
దిశ, వేములవాడ: వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో గల శ్రీ

X
దిశ, వేములవాడ: వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో గల శ్రీ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో త్రాగునీరులో క్రిములు రావడం, అపరిశుభ్రత నిర్వహణ లోపంతో వినియోగదారుల ద్వారా మున్సిపల్ అధికారులు ఫిర్యాదు అందుకున్నారు. దీంతో అధికారులు విచారణ చేపట్టి నిషేధిత ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ పరిసర ప్రాంతాల్లో మంచి నీరును పరిశీలించి నిర్వాహకులకు జరిమానా విధించారు. ఇలాంటి సంఘటన పునరావృతం అయితే హోటల్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో శానిటేషన్ ఇన్స్పెక్టర్ నగేష్ గౌడ్ తో పాటు కిరణ్ సిబ్బంది పాల్గొన్నారు
Next Story






