- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు రానున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు టీటీడీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్
- ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి..
- రూ.35 కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- నాచుపల్లిలోని ఓ రిసార్ట్ లో జనసేన కేడర్‌తో భేటీ
- ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్, ఎస్పీ
దిశ, జగిత్యాల ప్రతినిధి/కొండగట్టు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు రానున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు టీటీడీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొండ గట్టు ఆలయ అభివృద్ధికి సహకారమందిస్తానని గతంలో పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఈ మేరకు టీటీడీ అధికారులతో చర్చించి రూ 35.19 కోట్లు మంజూరు చేయించారు. పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
రూ.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
పవన్ కళ్యాణ్ ఉదయం 9.25 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.25 గంటలకు కొండగట్టు జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం 10.30 గంటలకు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భక్తుల వసతికై 96 గదుల నిర్మాణం, ఒకేసారి రెండు వేల మంది దీక్ష విరమణ చేసుకునేలా మాల విరమణ మండప నిర్మాణ పనులు ఉన్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, బి.మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్ఏసీ చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొననున్నారు.
కొండగట్టు అంజన్నపై అపార నమ్మకం.
కొండగట్టు ఆంజనేయస్వామిపై పవన్ కల్యాణ్ కు అపారమైన నమ్మకం ఉన్నది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం, జనసేన పార్టీ స్థాపన సందర్భాల్లో పవన్ కల్యాణ్ కొండగట్టును సందర్శించారు. ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి కూడా ఇక్కడే తొలి పూజ చేయించారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు.
రిసార్ట్ లో కార్యకర్తలతో సమావేశం
ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ 11.30 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని ఓ రిసార్ట్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ నాయకులతో పవన్ చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేయగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు శుక్రవారం హెలిప్యాడ్ సహా టెంపుల్ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.






