- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
by velandi.Saikiran |
లంచం తీసుకుంటూ ఏసీబీకి గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టుపడ్డాడు. వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన

X
దిశ, వీణవంక: లంచం తీసుకుంటూ ఏసీబీకి గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టుపడ్డాడు. వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు నిర్మాణం జరిగిన ఇంటికి నెంబర్ ఇవ్వడానికి లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.ఈ తరుణంలోనే ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ఏ ప్రభుత్వ అధికారి అయిన లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్ కి సమాచారం అందించాలని కోరారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
గ్రామస్తుల సంబరాలు
కార్యదర్శి కుంభం నాగరాజు ఏసీబీకి పట్టుబడ్డాడని తెలుసుకున్న గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి చేరుకొని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
Next Story






