- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పద్మశాలిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
ద్మశాలీలు రాజకీయంగా పూర్తిగా వెనుక బడ్డారని, ప్రభుత్వాలు రాజకీయ ప్రాధాన్యత కల్పించి చైతన్యవంతం చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు.

దిశ, కొత్తపల్లి : పద్మశాలీలు రాజకీయంగా పూర్తిగా వెనుక బడ్డారని, ప్రభుత్వాలు రాజకీయ ప్రాధాన్యత కల్పించి చైతన్యవంతం చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. కరీంనగర్ లో పద్మశాలి జిల్లా సంఘం, పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణమండపంలో నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని వెనుకబడిన పద్మశాలీలు రాజకీయాలకు రావడం జరిగిందన్నారు. సరైన గుర్తింపు లేకపోవడంతో చట్ట సభల్లో ప్రాధాన్యత కోల్పోతున్నారని పేర్కొన్నారు. సమాజంలో ఎంతో సంఖ్య బలం ఉన్నప్పటికీ రాజకీయంగా కొన్ని వర్గాలకు చెందిన నాయకులు అనగ తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలీలు ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అందరిపై ఉందని, రాజకీయ చైతన్య సదస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కొన్ని వర్గాలు పద్మశాలీలపై వివక్ష చూపడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ ఏర్పాటు అయితే పద్మశాలీలకు రాజకీయంగా రాణించే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ అవకాశాలను ఎవరికి వారే పెంపొందించుకోవాలని, పాదరసం లాంటి గుణం కలిగిన పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. నాటి రాజకీయ నాయకుల స్ఫూర్తితో రాజకీయ చైతన్య వారసత్వాన్ని పద్మశాలీలు పునికి పుచ్చుకోవాలన్నారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పునర్విభజన వల్ల స్థానాలు పెరిగే అవకాశం ఉన్నాయన్నారు. వాటిని పద్మశాలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో ఆసక్తిగల వారు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాల న్నారు. పద్మశాలీలు సంఘటితంగా వేదికలను ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరాభిమానాలు పొందాలన్నారు. కార్పొరేషన్ చైర్మన్ ల నియామకం ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాలనలో పద్మశాలిలకు ప్రాధాన్యత కల్పించాలని వారన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో గెలుపొందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ లను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం , జిల్లా పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు స్వర్గం మల్లేశం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు బోల్ల శివశంకర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పోరండ్ల కిషన్, ఆర్విఎం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు గుంటుక రూప, అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం కార్యదర్శి గొరిట్యాల సమత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్, అఖిలభారత పద్మశాలి సంఘం కోశాధికారి కొక్కుల దేవేందర్, కార్యదర్శి బొడ్ల తిరుపతి, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణహరి, జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షులు మామిడాల సురేందర్, జిల్లా శిశు, సంక్షేమ శాఖ అధికారి మార్త సరస్వతి, ట్రాన్స్కో ఎస్సీలు గంగాధర్, రవీందర్, మున్సిపల్ చైర్మన్లు జిందం కల, వడ్నాల శ్రీనివాస్, కటకం రవీందర్, వేముల నాగలక్ష్మి, జిల్లా నాయకులు చేరాల మల్లికార్జున్ దేవ్, వేముల విష్ణుమూర్తి, వోడ్నాల రవీందర్, మార్త ప్రకాష్,రుద్రరాజు, జక్కని సంజీవ్, దాస సురేష్, అల్సభద్రయ్య, ఇప్పనపల్లి సాంబయ్య వేముల చంద్రశేఖర్,స్వర్గము నర్సయ్య, జక్కని ప్రభాకర్, దికొండ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు వాసాల రమేష్ చొప్పరి జయశ్రీ, వేముల కవితా చంద్రశేఖర్, తేల లక్ష్మిరమేష్, మాసం గణేష్, దేవసాని సరస్వతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.






