కోడి పందేల నిర్వాహ‌కులు అరెస్ట్

by Ratna Kumari |

పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోళ్ల పందేలు నిర్వహిస్తున్న నిర్వాహకులను పెద్దపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కోడి పందేల నిర్వాహ‌కులు అరెస్ట్
X

దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోళ్ల పందేలు నిర్వహిస్తున్న నిర్వాహకులను పెద్దపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొన్ని గ్రామాల్లో అక్రమంగా కోళ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం 3 సెల్ ఫోన్లు, 3 పందెం కోళ్లు, 15 కోళ్ల కత్తులు రూ.14 వేల నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.


ఈ సందర్భంగా ఎస్‌ఐ మల్లేష్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోళ్ల పందేలు, జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రిమాండ్‌కు తరలించిన వారిలో సార్ల అంజి (కనగర్తి), సంజయ్ (బ్రాహ్మణపల్లి), బండ శ్రవణ్ కుమార్ (అప్పన్నపేట), గుర్రాల శ్రీనివాస్ (రాగినేడు), పిడుగు శ్రీనివాస్ (అప్పన్నపేట), సంజయ్ (పెద్దమ్మనగర్, పెద్దపల్లి), హరీష్ (గొల్లపల్లి), గుర్రాల తిరుపతి, లచ్చన్న ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story