అక్రమ ఇసుక రవాణాకు అధికారుల అండదండలు.. అడ్డగోలుగా దందా

by Naga Rani Yarlagadda |

ఊటూర్ ఇసుక రీచ్ నిర్వాహకులు సంవత్సర కాలంగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం కళ్లున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అక్రమ ఇసుక రవాణాకు అధికారుల అండదండలు.. అడ్డగోలుగా దందా
X

దిశ, కరీంనగర్ బ్యూరో: ఊటూర్ ఇసుక రీచ్ నిర్వాహకులు సంవత్సర కాలంగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం కళ్లున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి రీచ్ నిర్వహణ అప్పగించినప్పటికీ ఇసుక రీచ్‌లను పర్యవేక్షించాల్సిన అధికారులు తమ విధులను విస్మరిస్తున్నారు. దీంతో రీచ్ నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాకు గండికోడుతూ ఏడాదికాలంగా తప్పుడు వే బిల్లులతో అక్రమార్జన సాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అర్థరాత్రి అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నా లారీలను పట్టుకుని అడ్డగించినప్పటికీ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఇసుక అక్రమ దందాలో అధికారుల పాత్రను బలపరుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. సంవత్సరకాలం పాటు అడ్డగోలుగా అక్రమ ఇసుక రవాణా సాగించిన రీచ్ నిర్వాహకులు దిశలో కథనం ప్రచురితం కాగానే ఉలిక్కి పడ్డారు. ఉన్న ఫలంగా ఇసుక రీచ్‌లో వే బ్రిడ్జిని ఏర్పాటు చేయడం స్థానికులను ఆశ్యర్యానికి గురిచేసింది. కాగా, ఈ విషయం ఏడాదికాలంగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. కాగా, గ్రామస్తులు అర్థరాత్రి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని ఆధారాలతో అధికారులకు అప్పగించినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వే బిల్లులు కూడా పరిశీలించకుండానే లారీలను పంపించడం అక్రమాల్లో అధికారుల పాత్రను స్పష్టం చేస్తుంది.

ఊటూర్ ఇసుక రీచ్ నిర్వాహకులు సంవత్సర కాలంగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం కళ్లున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి రీచ్ నిర్వహణ అప్పగించినప్పటికీ ఇసుక రీచ్‌లను పర్యవేక్షించాల్సిన అధికారులు తమ విధులను విస్మరిస్తున్నారు. దీంతో రీచ్ నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాకు గండికోడుతూ ఏడాదికాలంగా తప్పుడు వే బిల్లులతో అక్రమార్జన సాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అర్థరాత్రి అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నా లారీలను పట్టుకుని అడ్డగించినప్పటికీ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఇసుక అక్రమ దందాలో అధికారుల పాత్రను బలపరుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.

దిశ కథనంతో రీచ్‌లో వేబ్రిడ్జి ఏర్పాటు..

సంవత్సరకాలం పాటు అడ్డగోలుగా అక్రమ ఇసుక రవాణా సాగించిన ఇసుక రీచ్ నిర్వాహకులు దిశలో కథనం ప్రచురితం కాగానే ఉలిక్కి పడ్డారు. ఉన్న ఫలంగా ఇసుక రీచ్‌లో వే బ్రిడ్జిని ఏర్పాటు చేయడం స్థానికులను ఆశ్యర్యానికి గురిచేసింది. కాగా, ఈ విషయం సంవత్సరకాలంగా అక్రమ ఇసుక రవాణాకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. కాగా, గ్రామస్తులు అర్థరాత్రి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని ఆధారాలతో అధికారులకు అప్పగించినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వే బిల్లులు కూడా పరిశీలించకుండానే లారీలను పంపించడం అక్రమాల్లో అధికారుల పాత్రను స్పష్టం చేస్తుంది.

అక్రమ రవాణాకు అడ్డాగా ఊటూర్ రీచ్..

ఇసుక అక్రమ రవాణాకు ఊటూర్ రీచ్ అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు అధికారపార్టీ నేతలు భాగస్వాములుగా రీచ్‌లు నిర్వహించడంతో అధికారులు సైతం అక్రమ రవాణాకుసై అంటున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా స్థానికంగా వ్యతిరేకతను సైతం అదిగమించేందుకు ఇసుక రీచ్ నిర్వాహకులు లాభంలో కొంత షేర్‌ను వారికి అప్పగిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకోవడం విశేషం.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

ఇసుక రీచ్ నిర్వాహకులు అక్రమ రవాణాకు అడ్డంకులను తొలగించుకునేందుకు పక్కా ప్లాన్ ప్రకారం వ్యవరిస్తూ వారి దందాను సాఫీగా సాగిస్తున్నట్లు స్థానిక పరిస్థితులను చూస్తే స్పష్టం అవుతుంది. ప్రజాప్రతినిధులతోపాటు గ్రామస్తులకు కులాల వారీగా పని కల్పిండంతో రీచ్ నిర్వాహకులు చేసే ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు సైతం శాఖల వారీగా నెలనెలా ఎవరికి ముట్టేది వారికి అందడంతో ఊటూర్ నుంచి హైదరాబాద్ వంటి మహానగరాల వరకు రీచ్ నిర్వాహకులు అక్రమ రవాణాను సాగిస్తున్నారు.

Next Story