ఏకోపాధ్యాయ పాఠశాలకు ఇద్దరే పిల్లలు!

by Chintha Aamani |

విద్యా వ్యాప్తి కోసం ప్రజా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న కొన్ని చోట్ల సత్ఫలితాలివ్వడం లేదు.

ఏకోపాధ్యాయ పాఠశాలకు ఇద్దరే పిల్లలు!
X

దిశ, పెద్ద కొత్తపల్లి: విద్యా వ్యాప్తి కోసం ప్రజా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న కొన్ని చోట్ల సత్ఫలితాలివ్వడం లేదు. ఇందుకు ఉదారణగా.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం దేదినేని పల్లి తండా లో ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు. గత విద్యా సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.గతంలో ఇక్కడ పని చేసిన ఉపాధ్యాయుడు పాఠశాలలు పునః ప్రారంభంలోనే బదిలీపై వెళ్లారు.

ప్రస్తుతం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయిని రాధ విధులు నిర్వర్తిస్తున్నారు. వాస్తవంగా పాఠశాలలో ముగ్గురు పిల్లలు మాత్రమే రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకోగా.. ఒక్కొక్క రోజు ఇద్దరు పిల్లలు మాత్రమే చదువుకోవడానికి పాఠశాల కు వెళ్తుంటారు. తండాలో అందరూ లంబాడిలే. వంద కుటుంబాల లోపల ఉండగా తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే ప్రాంతాల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించి చదివిస్తున్నారు. ఈలాంటి పరిస్థితి లో ఉపాధ్యాయురాలు రాధ పాఠశాలకు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ ఆ ఇద్దరు పిల్లలకు విద్యాబోధన చేయిస్తున్నారు.ఇదిలావుండగా ప్రభుత్వం నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చినా క్షేత్ర స్థాయిలో అందరికీ ,విద్య,నీరుగారిపోతుందని చెప్పక తప్పదు.

Next Story