కోడెల పంపిణీ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు

by Elthuri vijay kumar |

ఈ నెల 14వ తేదీన ఆదివారం ఉదయం 09.00 గంటలకు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో ఉన్న రాజన్న కోడెలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కోడెల పంపిణీ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు
X

కోడెల పంపిణీ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు

- ఈనెల 14 వేములవాడలో పంపిణీ

- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

దిశ, వేములవాడ : ఈ నెల 14వ తేదీన ఆదివారం ఉదయం 09.00 గంటలకు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో ఉన్న రాజన్న కోడెలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు ఆన్లైన్లో జిల్లా వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకున్న రైతులు ధృవీకరణ పత్రాలతో రావాలని సూచించారు. అర్హులైన ఉమ్మడి కరీంనగర్, పరిసర జిల్లాలలోని చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్ ఆధార్ కార్డ్ తో పాటు ఇతర సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ వెబ్సైట్ https://rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని, జియో ట్యాగింగ్, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో కోడెలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని తెలిపారు. కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story