- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > ఎన్టిపిసి ప్లాంట్ లో ప్రమాదం..ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలు
ఎన్టిపిసి ప్లాంట్ లో ప్రమాదం..ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలు
by Bhanu |
ఎన్టిపిసి రామగుండం ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాల పాలైనారు.

X
దిశ, గోదావరిఖని: ఎన్టిపిసి రామగుండం ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాల పాలైనారు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం షిఫ్టులో విధులు నిర్వహిస్తున్న లక్ష్మీపురంకు చెందిన కొమురయ్య ఎన్టిపిసి రామగుండం అన్నపూర్ణ కాలనీకి చెందిన అంకూస్ స్టేజ్ టు నాలుగో యూనిట్లో టర్బైన్ వద్ద విధులు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆయిల్ పైప్ లైన్ లీకేజీ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో వేడి ఆయిల్ కాంట్రాక్ట్ కార్మికుల మీద పడటంతో గాయాలయ్యాయి. వీరిని వెంటనే తోటి కార్మికులు చికిత్స నిమిత్తం పర్మినెంట్ టౌన్షిప్ ధన్వంతరి ఆసుపత్రి తరలించారు. కొమురయ్యకు గాయాలు ఎక్కువ కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎన్టిపిసి అధికారులు సందర్శించారు. ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Next Story






