- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమయం దాటిన ఆగని మట్టి రవాణా ?
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సమయపాలన పాటించకుండా సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా యదేచ్చగా జేసీబీ యంత్ర సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణా కొనసాగిస్తున్నారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సమయపాలన పాటించకుండా సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా యదేచ్చగా జేసీబీ యంత్ర సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణా కొనసాగిస్తున్నారు. ఈమట్టి రవాణా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఓ నిర్మాణానికి సంబంధించి మట్టి రవాణా కొనసాగిస్తున్నట్లు తెలిసింది సమయం దాటినా కూడా మట్టి రవాణా జరుగుతుందని పలువురు గ్రామస్తులు మీడియాకు తెలియజేయడంతో అక్కడికి వెళ్లిన మీడియా పై జేసీబీ యజమాని కి సంబంధించిన బంధువులు ఒకరు దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు అలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని మీడియా వారు ప్రశ్నించగా.. మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చిందులు తొక్కారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మీడియా సభ్యులు పేర్కొన్నారు. సమయం దాటిన మట్టి రవాణా జరుగుతుందని ఈ విషయమై సదరు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసిన కానీ ఫోను లిఫ్ట్ చేయలేదు. గత రెండు రోజుల క్రితం కూడా రాత్రిపూట రెవెన్యూ అధికారులకు తెలియకుండా మట్టి రవాణా జరుగుతుండగా.. ఆ గ్రామ శివారుకు టిప్పర్ వెళ్లగా అట్టి టిప్పర్ పంచర్ కావడంతో సదరు టిప్పర్ యజమాని ఆ మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించి మరోచోట పోసి ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం.






